దర్శి నియోజక వర్గంలో జనసేన కార్యకర్తలలో అయోమయం నెలకొన్నది. నియోజక వర్గంలో ఇప్పటికే ఇరువురు కాపు సామాజిక వర్గ నేతలు చందలూరుకు చెందిన బొటుకు రమేష్. పొదిలికి చెందిన వరికూటి నాగరాజులు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తమదే టిక్కెట్ అంటే… తమదే అంటూ ..ఎవరికి వారు కార్యకర్తలకు చెప్పుకుంటున్నారు. కాపు సామాజిక వర్గానికే టికేట్ రావాలంటూ.. కాపు సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు బలంగా వాదనను వినిపిస్తున్నారు.
చందలూరుకు చెందిన బొటుకు రమేష్ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ లో ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసాడు. అనంతరం పలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అయితే గత సంవత్సరం నుండి పొదిలికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన వరికూటి నాగరాజు పార్టీలో కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ..తనదే టికేట్ అంటూ కార్యకర్తలలో అయోమయం సృష్టించారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం టిడిపి సమన్వయ కర్తగా ఉంటూ తనకు ఇన్చార్జి పదవి ఇవ్వలేదన్న కోపంతో పార్టీ సమన్వయకర్త పదవికి పమిడి రమేష్ రాజీనామా చేసారు. అప్పటి నుండి దర్శి టిడిపి ఇన్చార్జి లేని అనిశృతి నెలకొన్నది. ఈనెపద్యంలో టీడిపి, జనసేన పొత్తు అనివార్యమని ఇరు పార్టీల కార్యకర్తలు భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా పమిడి రమేష్ జనసేన రాష్ట్ర వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ను జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ తో కలసి కలవటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది.
దీంతో దర్శి నియోజక జనసైనికులలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలైనది. దర్శి టికేట్ కాపు సామాజిక వర్గానికి కాకుండా కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తారేమో నని అనుమానం మొదలైనది… ఇప్పటికే జిల్లా స్థాయిలో కొందరు ప్రముఖులకు అందుకు సహకరిస్తున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు పలువురు టిడిపిలో మొదటి నుండి ఉంటున్నారు. వారు జనసేనలో పమిడి రమేష్ పోటీచేసినట్లయితే సహకరిస్తారా లేదా అనేది తీవ్ర రాజకీయ చర్చాంశనీయంగా మారినది.
టిడిపి సమన్వయకర్తగా రాజీనామా చేసిన పమిడి రమేష్, టిడిపి నేతలను కలవకుండా జనసేన నేతలకు కలవటం జనసేనలో టికేట్ ఆశిస్తూ నాదేండ్లతో మాట్లాడటంపై ఒక్కసారిగా నియోజక వర్గంలో టిడిపి కార్యకర్తలలో కూడా ఆమోమయం నెలకొన్నది.
