రోటరీ క్లబ్ దర్శి ఆధ్వర్యంలో సోమవారం చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు చేతులు మీదుగా వ్యాపారులకు రూ.12 వేల విలువైన ఎనిమిది మంది చిరు వ్యాపారులకు బండ్లు అం దజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేశ్వర రావు మాట్లాడుతూ రోటరీ క్లబ్ దర్శి సేవా గుణం తో చిరు వ్యాపారులను ప్రోత్సహిం చడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ దర్శి అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి నలుగురికి, సెక్రటరీ రెడ్డిమాసు శ్రీనివాసరావు ముగ్గురికి, పాల కొలను రవీంద్రరెడ్డి ఒకరికి తోపుడు బండ్లకు సహాయం చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కోశాధికారి కర్ణా భాస్కరరెడ్డి, సభ్యులు శ్రీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఎం
బాషా, డాక్టర్ కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, లక్ష్మీనారాయణ, పానుగంటి కోటేశ్వరరావు, పేరిరెడ్డి, నారాయణరెడ్డి, రాజారెడ్డి, మార్తుల భాస్కర్, శివకోటిరెడ్డి పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ దర్శి ఆధ్వర్యంలోచిరువ్యాపారులకు తోపుడు బండ్ల పంపిణీ…
13
Feb