క్యాన్సర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారి వి జ్యోతి, వైద్యరాలు ఎం జాస్మిన్ లు అన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండ్ సెంటర్ వరకు క్యాన్సర్ పై ప్లకార్డులు పట్టుకొని విద్యార్థులతో సైకిల్ తో ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికా రి, వైద్యరాలు మాట్లాడుతూ ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించుకోవచ్చు అన్నారు. అసం క్రాక మిక వ్యాధులైన రక్త పోటు. మధుమేహం. థైరాయిడ్. మానసిక ఒత్తిడి మొదలగు వ్యాధులను గుర్తించి వివరించడం మైనది. ప్రతిరోజు సైకిల్ తొక్కడవలన మనిషికి కావాల్సినంత ఆరోగ్యంతో పాటు వ్యాయామం తోపాటు అనారోగ్య సమస్యలు రావన్నారు. అనంతరం విద్యార్థులతో పాటు ఆరోగ్య కేంద్రాధికారులు కూడా యోగాసనాలు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిహెచ్ఓ పి నారాయణ రావు. హెల్త్ విజిటర్ వి కన్యాకుమారి. రత్న కుమారి. ఫార్మసిస్ట్ యుగంధర్. ల్యాబ్ టెక్నీషియన్ నాగార్జున. సీనియర్ అసిస్టెంట్ ప్రభుదాసు, పాలే పోగు డగ్లస్, సురేంద్ర సాగర్, ప్రభావతి, స్మైలీ, స్వప్న, అంకమ్మరావు, ప్రేమానిధి, రాముడు. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
