పేదలను ఆదుకోవడం అభినందనీయం

సేవాగుణంతో పేద నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తూ వారిని ఆదుకోవడం అభినందనీయమని శ్రీ షిరిడి సాయి గానగ మందిరం ట్రస్ట్ చైర్మన్ మరియు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు గుమ్మడిల్లి వెంకటరావు అన్నారు. మండలంలోని పసుపుగల్లు ఎస్సీ కాలనీలో పక్షవాతంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నవారిని గుర్తించి తనకు ఉన్నంతలోనే వారికి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న పొట్లూరు శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆ కాలనీ కి వెళ్లి పలువురికి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు దుస్తులు దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీవాసులు శ్రీనివాసరావును అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *