బొద్దికూరపాడు గ్రామంలో జ్వాలా ముఖి అమ్మవారి దేవాలయంలో మంగళవారం స్వామి వారి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాధవస్వామి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ పులి అంజి రెడ్డి దంపతులు సింహా వాహనం, పులి వెంకటేశ్వర రెడ్డి, శిరీష దంపతులు బహుకరించిన త్రికూలంను, గ్రంథపల్లి దశరథ రామయ్య ధర్మపత్ని కౌసల్య బహుకరించిన బలిపీఠంలను వేదపండితులు ఆధ్వర్యంలో ప్రతిష్టించారు.హోమాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, గ్రామ పెద్దలు యోగిరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

