APTF బలపరచిన స్వతంత్ర అభ్యర్థి L C రమణారెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహణ

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి( MLC ) అభ్యర్థి L C రమణారెడ్డి గెలుపు కోసం మంగళవారం ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో APTF బాధ్యులు ప్రచారం నిర్వహించారు . బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం, తూర్పు గంగవరం , లక్కవరం, శివరామపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో .. తాళ్లూరు KGBV, GHS, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ , ABC , శ్రీ సరస్వతి , జాహ్నవి, శ్రీ గంగా రెసిడెన్సీయల్ పాఠశాలలలోని ఉపాధ్యాయులను కలసి APTF తాళ్లూరు మండల శాఖ తరపున ఓట్లను అభ్యర్థించారు. APTF జిల్లా అధ్యక్షులు వాకా జనార్దనరెడ్డి మాట్లాడుతూ .. 40 ఉపాధ్యాయసంఘాలు మరియు APTF బలపరచిన స్వతంత్ర అభ్యర్థి L C రమణారెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకోవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రచార కార్యక్రమం లో APTF జిల్లా అధ్యక్షులు వాకా జనార్ధనరెడ్డి, APTF తాళ్లూరు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పోలంరెడ్డి సుబ్బారెడ్డి, కొమ్మినేని శేషు APTF నాయకులు B రంగారావు, K జవహరబాబు, నాగేశ్వరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *