ముండ్లమూరు మెయిన్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో విద్యార్థిని విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన కల్పించారు. ముండ్లమూరులోని మెయిన్ ప్రాథమిక పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు చెన్నయ్య పోలీసు విధులపై విద్యార్థులను ఒంగోలుకు తీసుకువెళ్లి అక్కడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్ వరకు వారు చేసే విదల గురించి అవగాహన కల్పించారు. తుపాకి అంటే ఏమిటి దాన్ని ఎలా వినియోగిస్తారు ఎప్పుడు వినియోగిస్తారు దాని గురించి విద్యార్థులకు తెలియజేశారు. పోలీస్ జాగిలం అంటే ఏంటి జాగిలం చేసే పని తీరుపై అవగాహన కల్పించారు. అనంతరం కొత్తపట్నం సముద్రాన్ని కి తీసుకువెళ్లి అలలు ఇలా ఉంటాయి. సముద్రంలో సుడిగాలి ఇలా వస్తుంది అని విద్యార్థులకు తెలియజేశారు. చేపలు పట్టే వలలు బోట్లు విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రాఘవ పాల్గొన్నారు.
పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన
19
Feb