సిరులు కురిపిస్తున్న వైట్ బర్లి

ఏ పంటలు సాగు చేసిన శ్రమ అధికం రాబడి తక్కువ. పంటలే జీవనాధారమై పండిస్తున్న తీరా ఇంటికి వచ్చి విక్రయించే సమయానికి గిట్టుబాటు ధర లేక రైతు లు అల్లాడిపోతున్నారు. అయితే వైట్ బర్లి పొగాకు సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. కష్టానికి తగ్గ ఫలితం పెట్టుబడి తక్కువ. అధిక దిగుబడి వస్తున్నడంతో రైతులు బర్లి పొగాకు వైపు మొగ్గు చూపుతున్నారు. ముండ్లమూరు మండలంలోని తమ్మలూరు. నాయుడుపాలెం. పూరి మెట్ల . భీమవరం. మారెళ్ళ. జమ్మలమడక. మక్కినేని వారి పాలెం. ఈదర. పసుపుగల్లు. ముండ్లమూరు. వేంపాడు. పోలవరం .శంకరాపురం. సుంకర వారి పాలెం. నూజిలపల్లి. బట్లపల్లి. ఉమామహేశ్వరపురం. అయితే గ్రామాలలో ఏడాది2900 ఎకరాల్లో పొగాకు సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి70 వేలు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. ఎకరాకు పది క్వింటాళ్ల పొగాకు వస్తుందని అనుకునే సమయంలో అకాల వర్షాలు పడి 7 నుండి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని కొంతమంది రైతులు తెలిపారు. మరి కొంతమంది రైతులు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని తెలిపారు. క్వింటా ధర11500 ధర పలుకుతుందని దీంతో ఎకరాకు పెట్టుబడి పోను 25 వేల నుండి30 వేల వరకు వస్తుందన్నారు. రంగు ఆకు ధర ను బట్టి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు గత ఏడాది2100 ఎకరాల్లో సాగు చేయగా సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండడంతో ఈ ఏడాది ఎక్కువ సాగు చేశారు. మరి కొంతమంది రైతులకు వర్షాలు పడి దెబ్బ తినడంతో 8 నుండి 9 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే ధర11500 కొనుగోలు చేస్తుండడంతో ఎకరాకు పెట్టుబడి పోను 5 వేల నుండి పదివేల వరకు ఆదాయం వస్తుందన్నారు. రైతులు అష్ట కష్టాలు పడుతూ పొలాలకు నీటి తడులు అందిస్తూ పంటలను కాపాడుకుంటున్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *