సమన్వయంతో పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ కోరారు. తాళ్లూరు మండల సచివాలయాల జెసీఎస్ మండల కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి మంగళవారం మద్దిశెట్టి శ్రీధరన్ను కలసి తనను జెసీఎస్ కన్వినర్గా నియమించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి రవీంద్ర, డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ లకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు. సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా యాడికకు సూచించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, గుంటి గంగా ఆలయ కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డిలు పాల్గొన్నారు.
సమన్వయంతో పార్టీ అభ్యున్నతికి కృషి చెయ్యాలి – వైసిపి నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్
20
Feb