ముండ్లమూరులో పోలేరమ్మతల్లికి జలాభిషేకం నిర్వహించారు. భక్తులు పొంగల్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. 101 బిందెలతో జలాభాషేకం నిర్వహించారు. ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. యాదవ రాజుల ఇలవేల్పు శ్రీనాగార్పమ్మతల్లికి జమ్ములకుటుంబ సభ్యులు ప్రతి ఏటా కొలుపులు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
గ్రామస్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం చెల్లించారు. బంధుమిత్రుల రాకతో గ్రామం కళకళలాడింది.


