లోపరహితంగా ఓటర్ల జాబితా ఉండాలి – జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె. శ్రీనివాసులు

లోపరహితంగా ఓటర్ల జాబితా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కె. శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఒంగోలు నగరంలోని 117వ పోలింగ్ కేంద్రం పరిధిలో మరియు కొత్తపట్నం మండలం అల్లూరులో చనిపోయిన ఓటర్ల తొలగింపుపై రీవెరిఫికేషన్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డూప్లికేషన్ ఓటర్లను తొలగించడంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆయన పునరుద్ఘాటించారు. గత ఏడాది జనవరి నుంచి తొలగించిన ఓట్ల విషయంలో ఈ నిబంధనలు పాటించిన తీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన వెంట ఆర్.డి.ఓ. విశ్వేశ్వరరావు, ఒంగోలు తహశీల్దార్ మురళి, కొత్తపట్నం తహశీల్దార్ రమణారావు, ఎన్నికల సూపర్ వైజర్లు, బి.ఎల్.ఓ.లు, ఇతర అధికారులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *