నేత్రదానం మహాదానం -నేత్రదానాన్ని ప్రోత్సహించండి జిల్లా వైద్యాధికారి రాజ్యలక్ష్మి

నేత్రదానం మహాదానం అని ప్రతి ఒక్కరూ నేత్రదానాన్ని ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి రాజ్యలక్ష్మి అన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలము లో సోమవారం నేత్రదాన పక్షోత్సవాలు ఉదేశించి.. డాక్టర్ రాజలక్ష్మి ఆప్తమాలిక్ ఆఫీసర్స్ కి సమీక్షా సమావేశము నిర్వహించినారు. కార్యక్రమంలో జిల్లా వై ద్యాధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ….ప్రతి ఒక్కరు వాళ్ళ తదనంతరము దానము చేయవలసినదిగా తెలియపరిచారు. కళ్ళు దానము చేసినవారి వల్ల మరొకరికి కంటి చూపు పొందుతారని వారి జీవితములో కొత్తవెలుగు చూస్తారని అన్నారు . కంటి దానము చేసినవారిని వారి జీవతములో మరచిపోరని తెలిపారు. అదేవిధముగా నేత్రదానము ప్రతి ఒక్కరి బాధ్యత, నేత్రదానము గురించి ప్రజలలో మంచి అవగాహన కల్పించాలని తెలియపరిచారు. కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ నళిని మాట్లాడుతూ.. కంటి వెలుగు ప్రోగ్రాం ( అవ్వ – తాత ) ప్రోగ్రాం జిల్లాలోని పారామెడికల్ ఆప్తామాలిక్ ఆఫీసర్స్ కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వాళ్ళ ఎవరు అయిన కంటికి సంబంధిచి చికిత్య కోసం వచ్చినవారిని జిల్లా ఆసుపత్రికి పంపించవలసినదిగా కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *