సాటి మనిషిని పశువుకాన్నా హీనంగా చూసే ధర్మం మాకొద్దు.- రజ్యాంగమే ముద్దు. – ఉదయానిది స్టాలిన్ మాటల్లో మంచిని గ్రహించలేని సనాతన ధర్మం మాకొద్దు. – ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉదయనిది స్టాలిన్ కి పాలాభిషేకం.

Jsdm-బాపట్ల-అద్దంకి :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ప్రముఖ సినిమా హీరో, ఉదయనిదిస్టాలిన్ వాఖ్యలను సమర్ధిస్తూ నేడు Sc St Bc&మైనారిటీస్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అద్దంకిలో పాలాభిషేకం నిర్వహించారు.
ఐఖ్య వేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు మాట్లాడుతూ సాటి మనిషిని పశువుకంటే హీనంగా చేసే సనాతన ధర్మం మాకు అవసరం లేదని, భారత రాజ్యాంగాన్ని మాత్రమే అనుసరిస్తామని ఆయన అన్నారు. ఉదయనిదిస్టాలిన్ మాటలు కేవలం హిందుత్వంలో ఇంకా మూఢ విశ్వాసలు ఉన్నాయని కేవలం వాటిని తొలగించాలని ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకొని, కొన్ని పార్టీలు మరణహోమానికి తెర తీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
అనంతరం అద్దంకిలోని బంగ్లా రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉదయనిది స్టాలిన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించినారు.
పలువురు దళిత సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ఐక్య వేదిక ప్రధాన కార్యాదర్శి జ్యోతి శ్రీమన్నారాయణ, ఉపాధ్యక్షులు అంకం నాగరాజు, బి.ఎస్.పి. కన్వీనర్ మందా జోసఫ్, జె. పంగులూరు మండల విద్యా శాఖాధికారి గోగుల వీరాంజనేయులు, తెలుగు ఉపాధ్యాయులు వంగేవరపు రమేష్, జ్యోతి డేవిడ్, బత్తుల చందు, బండారు చంటిబాబు, మంచు హనుమంతరావు, బుజ్జి కొమ్మాలపాటి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *