దర్శి మండలంలోని చలివేంద్ర గ్రామం వద్ద శ్రీ వెం కటాచలం క్షేత్రంలో జరిగిన శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ డ్డిలు పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అనంతరం వెంకాయమ్మ, శివప్రసాద్ రెడ్డిలు ఉట్టికొట్టి విద్యార్థులు, భక్తులను ఉత్సాహపరిచారు. వారిని దుశ్శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.





