రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం చీమకుర్తిలో ఉపాధ్యాయులకు సత్కారం నిర్వహించారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. చీమకుర్తి మండలంలో ఉత్తమ సేవలందించిన 12 మంది టీచర్ల ను ఎంపిక చేసి వారి సేవలను కొనియాడుతూ పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి మెమెంటోలు అందించారు. రోటరీక్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు గుండా చినవెంకటేశ్వర్లు, అంబటి వీరారెడ్డి, డాక్టర్ చెరుకూరి వెంకటేశ్వర్లు, పరాంకుశం శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.



