ఇండియా, భారత్ లు రెండూ ఒకటే అని అందులో భారతీయ జనతా పార్టీకి వేరే అభిప్రాయం లేదని, భారత దేశాన్ని భారత్ అంటే తప్పు ఏమి టని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాపాటి నారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో శుక్రవారం బిజేపీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. వి శివా రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రాపాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ . …బిజేపి శ్రేణులు పార్టీ ఆదేశాల మేరకు నామట్టి నాదేశం విజయవంతం చెయ్యాలని కోరారు. దేశంలో ప్రతి పక్షాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఎటువంటి విమర్శలకు తావు లేక పోవటంలో చివరకు ఇండియా, భారత్ పేరును రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.. రెండు పేర్లు కూడ అసలు పేరు, ఉరఫ్ పేరులా కలిసే ఉంటాయని ఉదహరించారు. పాస్ పోర్టు, ఇండియా కరెర్సీలలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ భారత్ అని, పాస్ పోర్టులో.. ఎన్నికల కార్డులలో ఉండే పదాలను ఉదహరించారు. వామపక్ష పార్టీలు ఎందుకు ప్రతిది రాద్ధాతం చేస్తున్నారో అర్థం కావటం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీతో పాటు, విద్యుత్ బిల్లులు పెంపుదల ఇతర అంశాలపై అనుసరిస్తున్న తీరును విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు వీవీ కిష్ణా రెడ్డి, ఉపాధ్యక్షుడు రావుల పల్లి నాగేద్రయాదవ్, ప్రధాన కార్యదర్శులు శివాజీ యాదవ్, కోరంకి నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బొద్దిలూరి ఆంజనేయులు, సెగ్గం శ్రీనివాసరావు, మైనారీమోర్చ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫా తుల్లా భాష, మహిళా నాయకులు పద్మావతి, సత్యవతి, కోటేశ్వరి, రాజశేఖర్, మండల అధ్యక్షుడు గుర్రం రంగనాథం, సత్యనారాయణ, దామోదర్, ఓబసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కుంచాల వెంకట శివ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధనిశేటి రాము నాయుడు తదితరులు పాల్గొన్నారు.
