విద్యార్థుల దృష్టిలోపంపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి – కంటి వైద్యునిపుణులు ఎం. వీ రమణా రెడ్డి

విద్యార్థుల కంటి సమస్యలపై పై తల్లిదండ్రులు చిన నాటి నుండే ప్రత్యేక శ్రద్ధ వహించాలని మోడరన్ ఐ హాస్పటల్ వైద్యనిపుణులు డాక్టర్ ఎం.వి రమణా రెడ్డి కోరారు. స్థానిక సంతపేటలోని సూర్య పబ్లిక్ స్కూల్లో శుక్రవారం మోడర్ ఐ కంటి వైద్య నిపుణులు డాక్టర్ అర్పణషాఫర్ ఆధ్వర్యంలో 700 మంది విద్యార్థులను పరీక్షించగా 140 మంది విద్యార్థులకు దృష్టిలోపం సమస్య ఉన్నట్లు కనుగొన్నట్లు వైద్యురాలు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల కంటి సమస్యలను ప్రాధమిక దశలో గుర్తించినట్లయితే కంటి చూపు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామి రెడ్డి, వైద్య సిబ్బంది నిఖల, కిరణ్, ప్రసాద్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *