విద్యార్థులు నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు వేతుక్కుంటూ వస్తాయని ఆర్కిటెక్ట్ డేవ్ అప్స్ ఇంజనీర్ జగదీష్ కడలి అన్నారు. పేస్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు ” రోల్ ఆఫ్ డేప్ అప్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీసోర్స్ పర్సన్ ఆర్కిటెక్ట్ డేవ్ అప్స్ ఇంజనీర్ జగదీష్ కడలి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ….. కోవిడ్ తర్వాత ఐటీ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని చెప్పారు. డేవ్ అప్స్ సాంకేతికత సంక్షోభంలోను అనేక అవకాశాలను కలిగిస్తుందని చెప్పారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.వి.కె మూర్తి. సీఎస్సీ విభాగపు హెడ్ డాక్టర్ సురేష్ దార, అకడమిక్ కోఆర్డినేటర్ గెరాబాఉ సాదినేని, కోఆర్డినేటర్స్ శ్రీహర్ష, కె. సురేష్ బాబు, వంశీ క్రిష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

