తాళ్లూరు మండలంలో విద్యుత్ శాఖ అకస్మిక దాడులు నిర్వహించారు. దర్శి ఈఈ కరీమ్ నేతృత్వంలో 39 మంది అధికారులు . 84 మంది సిబ్బందితో ఆకస్మిక దాడి నిర్వహించారు. 3324 సర్వీసులు తనిఖీ నిర్వహించారు. అదనపు లోడ్ వాడుతున్న 72 మందికి రూ.3.45 లక్షల అపరాధ రుసుం విధించారు. మీటర్లు లేకుండా వాడుతున్న ఇరువురికి మూడు వేలు జరిమాన, విద్యుత్ చౌర్యానికి పాల్పడిన – ఇరువురికి 8వేలు, అనుమతించిన క్యాటగిరిలో కాకుండా ఇతర క్యాటగిరిలో వాడుతున్న వారికి 18వేలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఈఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ చౌర్యంపై ఎదైనా సమాచారం ఉంటే 8331019950కు తెలిపి సహకరించాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు -గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో దర్శి, చీమకుర్తి డీఈలో కె పిచ్చయ్య, జీవి క్రిష్ణా రెడ్డి, తాళ్లూరు ఎఈ వీరబ్రహ్మం, పలు మండలాల ఎఈలు, ఎల్ ఐలు లైన్ మెన్లు పాల్గొన్నారు.
