జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం చెయ్యండి – తాళ్లూరు మండల వైద్యాధికారి డాక్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ బి

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తాళ్లూరు పీహెచసీ వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి కోరారు. తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరోగ్య, ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ప్రతి నివాసానికి వెళ్లి సంబంధిత యాప్లో నమోదు చెయ్యాలని సూచించారు. ఆయా గ్రామాలలో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రత్యేక వైద్య శిబిరంలో స్పేషలిస్ట్ డాక్టర్లు వచ్చిన రోజున విషయాన్ని గ్రామంలో ప్రజలకు తెలిపాలని కోరారు. ఈనెల 30న మాధవరం, అక్టోబర్ 3న మల్కాపురం, 4న శివరామపురం, 5న విఠలాపురం, 7న మన్నేపల్లి, దారం వారి పాలెం, 9న తురకపాలెం. 16న తాళ్లూరులలో వైద్యశిబిరాలు ఉంటాయని చెప్పారు. శిబిరాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. వైద్యుడు రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *