రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు మంగళవారం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పధకాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డపాటి అరుణ, వై.ఎస్.ఆర్.సి.పి. బి.సి. జోనల్ ఇన్ఛార్జి బొట్ల రామారావు, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా ఎస్.సి. సెల్ అద్యక్షలు దుర్గాప్రసాద్, కొండపి వై.ఎస్.ఆర్.సి.పి. సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్లు, బాలకోటి రెడ్డి, ప్రసాద్, తదితరులు ఉన్నారు.
