ప్రకాశం జిల్లాలో మళ్లీ ..భగభగలు -39 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు- ఆందోళనలో అన్నదాతలు

గత రెండు వారాలుగా జిల్లా వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. పలు ప్రాంతాల్లో 39 డిగ్రీలకు చేరువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్, అక్టో బర్ నెలల్లో మంచి వర్షపాతం నమోదు కావాలి. పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అక్టోబర్ రెండో వారంలోకి బేస్తవారపేట మోక్షగుండం ప్రవేశించినా వేసవి మాదిరిగా ఉదయం ఎనిమిది గంటల నుంచే సూరీడుసుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం అయిదు గంటల సమయంలోనూ వేడిగాలుల తీవ్రత కొనసాగుతుండడం… జన జీవనంపైనా ప్రభావం చూపుతోంది. ఆదివారం… జిల్లాలోని పది గ్రామాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొన్నలూరులో అత్యధికంగా 38.89 డిగ్రీలు నమోదైంది. ఓవైపు వరుణుడు ముఖం చాటేయడం… మరోవైపు ఎండల తీవ్రత పెరగడంతో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాత్రి వేళ ల్లోనూ 25 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమ నార్హం. గత నెలలో పలుచోట్ల రెండు, మూడు రోజులపాటు మోస్తరు జల్లులు పడటంతో వాతావరణం కొంత మేర చల్లబ డింది. తరువాత చినుకు జాడ లేకపోవడంతో రోజువారీ విద్యుత్తు వినియోగమూ పెరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అన్నదాతల్లో ఆందోళన…

ఖరీఫ్ సీజన్ కింద రైతులు మెట్ట పంటలు సాగు చేశారు. ఈ ఏడాది సరైన వర్షాలు లేక ఆయా పైర్లు ఎండుముఖం పట్టాయి. పచ్చిరొట్ట పైర్లుగా సాగు చేసిన జనుము, జీలుగ, పిల్లిపెసర వంటివి మొక్క దశలోనే ఎండిపోయాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా భూములు బీడుగానే ఉన్నాయి. మరోవైపు రబీ సీజన్ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో పొగాకు, శనగ పంటల సాగుకు కర్ష కులు సమాయత్తమవుతున్నారు. వరుణుడి జాడ లేకపోవడంతో పాటు… ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రత లతో వారిలో ఆందోళన నెలకొంది. దుక్కులు దున్ని, పొలాలు ఎప్పుడు సిద్ధం చేసుకోవాలన్న సందిగ్ధంలో ఉన్నారు.

ఆదివారం… వివిధ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఇది.. (డిగ్రీ సెల్సియస్)
పొన్నలూరు 38.89, ఉప్పలపాడు38.41, మోక్షగుండం38.4, మోదీనాపురం38.29,
గోగులదిన్నె 38.29,
ముండ్లమూరు 38.24, మర్రిపూడి38.21,గోల్లవిడిపి,
38.20, పునుగొడు 38.09,మాల పాడు 38.00, పెదఅలవలపాడు 37.82, అశ్వరాయుని పాలెం 37.09, దర్శి 37.86,తాటిచెర్ల 37.84,
అనుమలవీడు 37.83,దొనకొండ 37.78, పుచ్చకాయలపల్లి 37.64,
పామూరు 37.62 గా నమోదు అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *