పేదలకు మరింత చేరువగా వైద్యం

ముండ్లమూరు పేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి అన్నారు. మండలంలోని వేముల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపీడీవో ఎన్విఎల్ హనుమంతరావు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజల ఆరోగ్యం తమ బాధ్యతగా భావించిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఆమె అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంటి వద్దకే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారని ఆమె తెలిపారు. వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక ఇంటికే పరిమితమైన నిరుపేదలకు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ వైద్య శిబిరానికి ఒంగోలు రిమ్స్ స్పెషలిస్ట్ వైద్యులు శ్రీదేవి ,వెన్నెల హాజరై వైద్య సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి కంటి వైద్యులు నరసింహారావు హాజరై కంటి పరీక్షలు పరీక్షించారు. ఈ వైద్య శిబిరానికి మారెళ్ళ ముళ్ళమూరు వైద్యాధికారులు సిహెచ్ ప్రవీణ్ కుమార్, ఎం జాస్మిన్లు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరానికి 475 మంది హాజరై నారని వారందరికీ వైద్య పరీక్షలునిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసరావు, సూపర్ వైజర్ పి సుబ్బారావు, డిజిటల్ అసిస్టెంట్ ఇజ్జగిరి వీరబ్రహ్మం,హెచ్ వి కన్యా కుమారి, హెల్త్ అసిస్టెంట్ ఎం ప్రసాద్, ఫార్మసిస్ట్ కె యుగంధర్, ల్యాబ్ టెక్నీషియన్ నాగార్జున, ఏఎన్ఎం హిమబిందు,ఎం ఎల్ హెచ్ పి నందిని, అనిషా, స్వప్న, నాగలక్ష్మి, ఆరోగ్య మిత్ర గురవయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *