తురకపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహణ

తాళ్లూరు మండలం తురకపాలెంలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. సర్పంచి చంద్రగిరి గురువా రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. తాళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి షేక్ భాదర్ మస్తాన్ బి, వైద్యులు రాజేష్, మౌనిక, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణవి, డాక్టర్ లీలా మెలోర్డు వైద్యశిబిరంలో పాల్గొని 440 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసారు. తహసీల్దార్ ప్రసాద్, జెఏ శ్రీనివాసరావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి ,విఆర్ ఓ
చంద్రశేఖర్, గ్రామ కార్యదర్శి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *