పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచెయ్యాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పివీ శివా రెడ్డి కోరారు. జిల్లాలో పార్టీలో పలు మోర్చాల బాధ్యులను. పదాధికారులను నియమించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గ్రంధి వెంకట సత్యనారాయణ ( వైపాలెం), ఒంగోలు నుండి వైవీ గౌతమ్ అశోక్, రాయపాటి అజయ్ కుమార్, జజ్జన క్రిష్ణవేణిలను, తిండి నారాయణ రెడ్డి (దర్శి), కంభం వెంకట రమణా రావు (మార్కాపురం), మాకినేని అమర సింహాం (పొదిలి), బొమ్మల పద్మావతి (కనిగిరి), ప్రధాన కార్యదర్శులుగా కూకట్ల నాగేశ్వరరావు (దర్శి), ధనేకుల శివాజి యాదవ్ (ఒంగోలు, కొండ్రు పిచ్చయ్య (వై పాలెం), ఒంగోలు నుండి కార్యదర్శులుగా బసినే పల్లి రాజశేఖర్, తీగల సత్యవతిలను, కొండెపి నుండి జువ్విగుంట కోటేశ్వరి, అడుసుమల్లి ప్రియా రాధికలను, మొర్రిబోయిన చిన్నయ్య (మార్కాపురం), పాత కోట బ్రహ్మానంద రెడ్డి (గిద్దలూరు), గండపు గాలేశ్వరరావు (వై పాలెం), కొండపల్లి త్రిమూర్తులు (కనిగిరి), జిల్లా కోశాధికారిగా చల్లా శ్రీనివాసులులను నియమించారు. కిసాన్ ఎస్సీ, ఎస్టీ, ఒబిసీ, యువ, మహిళా, మైనార్టీ మోర్చాలకు జిల్లా కన్వీనర్లుగా బొంతల క్రిష్ణ, బొంతల క్రిష్ణ, దేవసొత్తు వెంకటేశ్వర్లు నాయక్, తానికొండ సురేష్ యాదవ్, పువ్వాడ దామోదర్, మలినేని గీతాంజలి, సయ్యద్ ఖాసింపీరా లను నియమించారు.
ఈ సందర్భముగా పివి శివారెడ్డి మాట్లాడుతూ పార్టి కమిటిలో జిల్లా నలుమూలల నుండి బాధ్యులను ఎంపిక చేశామని, ఎంతో అనుభవం కలిగిన, పార్టీ కార్యక్రమాలపై మీద నిబద్ధత కలిగిన వ్యక్తులను, రాబోవు ఎన్నికలలో జిల్లాలోని ప్రాంతీయ పార్టీలకు ధీటుగా ఢీ కొట్టే నాయకులను ఎంపిక చేశామని, వారందరూ తమ శక్తి వంచన లేకుండా పార్టీ విజయానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి, పార్టీ ఉన్నతికి విశేషంగా, పార్టి లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేయాలని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.
