జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన ఏడు నెలలు గ ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిపోర్టులు పంపని తాళ్లూరు తహసీల్దార్ KV ప్రసాద్ ను సస్పెండ్ చేసి అరెస్ట్ చెయ్యాలని దళిత నాయకులు నీలం నాగేంద్ర జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను కోరారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిపోర్టులు పంపకుండా అలసత్వం వహిస్తూ ఎస్సీ ఎస్టీ లను వేదిస్తున్న తాళ్లూరు తహసీల్దార్ అరెస్ట్ చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు సోమవారం బాధితుల నిరసన ర్యాలీ జరిగింది. తదనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు చప్పిడి వెంగలరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసుల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాలను తాళ్లూరు తహసీల్దార్ లెక్క చెయ్యడం లేదన్నారు. చింతలపాలెం లో దళితుల భూమి విషయం లో అగ్రకులాలు దాడి చేసిన ఘటన క్రైమ్ నెంబర్ 155/ 2021 ఈ కేసు లో రిలీఫ్ కొరకు రిపోర్ట్ పంపని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించి ఏడు నెలలు ఐనా తాళ్లూరు తహసీల్దార్ పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టరేట్ ఎస్సీ ఎస్టీ కేసుల సూపరింటెండెంట్ రవికుమార్ ఆరు సార్లు ఫోన్ చేసిన తాళ్లూరు తహసీల్దార్ కాకమ్మ కథలు చెప్పడన్నారు.
బాధితులు ఎ రోజు అడిగిన రెండు రోజుల్లో రిపోర్ట్ పంపిస్తానంటూ ఏడు నెలలు ఐనా తహసీల్దార్ కేవి ప్రసాద్ రిపోర్ట్ పంపలేదన్నారు.ప్రతి ఫైల్ కు డబ్బులు ఇవ్వనిదే సంతకం పెట్టని తాళ్లూరు తహసీల్దార్ కేవి ప్రసాద్ కలెక్టర్ అడిగిన ఎస్సీ ఎస్టీ రిలీఫ్ ఫైల్ కు కూడా డబ్బులు ఇవ్వలేదని స్టాఫ్ ఫైల్ తయారు సంతకం పెట్టలేదన్నారు.
అలాగే మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దార అంజయ్య మాట్లాడుతూ దర్శి మండలం బోట్లపాలెం లో కులాంతర వివాహ నేపథ్యంలో అగ్రకులాల చే హత్యయత్నానికి గురైన జక్కుల అనురాధ కూతురు మౌనిక నివసిస్తూ తాళ్లూరు మండలం తూర్పు గంగవరం లో ఇంటి స్థలం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించి ఒకటిన్నర నెల ఐనా తాళ్లూరు తహసీల్దార్ కేవి ప్రసాద్ డోంట్ కేర్ అంటున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ లకు రిలీఫ్ లు ఇవ్వడానికి ఇంటి స్థలాలు ఉచితంగా ఇవ్వడానికి ఎంఆర్వో ఆఫీస్ ఎమన్నా ధర్మ సత్రమా అంటూ వ్యంగంగా మాట్లాడుతున్నారన్నారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి రోజు మాకు ఎన్నో కాగితలు వస్తుంటాయి కలెక్టర్ చెప్తే చెయ్యాలని మాకు ఇష్టమైతేనే చేస్తానంటున్నారని మాల మహానాడు నాయుకులు దార అంజయ్య ఎంఆర్వో అలసత్వ అవినీతి ఎస్సీ ఎస్టీ వ్యతిరేకత ఫై ధ్వజమెత్తారు తదనంతరం టూ టౌన్ ఎసై దళిత నాయుకులను కొందరు బాధితులను కలెక్టర్ వద్దకు పంపించారు.
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ దళిత నాయుకులు నీలం నాగేంద్ర మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బాధితుల పట్ల తాళ్లూరు తహసీల్దార్ కేవి ప్రసాద్ అలసత్వ అవినీతి వైఖరి ధిక్కార స్వరం తో వ్యవహారిస్తున్నందున వెంటనే సస్పెండ్ చెయ్యాలన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 3(2)(V11) victimization At hands of A Public Servant నేరం కింద తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించి తాళ్లూరు తహసీల్దార్ కేవి ప్రసాద్ ను అరెస్ట్ చేయించాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే తాళ్లూరు తహసీల్దార్ కు ఫోన్ చెయ్యగ డిప్యూటీ తహసీల్దార్ ఇమ్మానియెల్ ఫోన్ ఎత్తుకొని తహసీల్దార్ వేరే పనిలో ఉన్నారని చెప్పాడు. ఇంతటా సీరియస్ ఐనా జిల్లా కలెక్టర్ ఫై రెండు కేసుల్లో చర్య తీసుకోవాలని వెంటనే తహసీల్దార్ ను తన తో ఫోన్ లో మాట్లాడించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో యానాది సేవ సంఘ నాయుకులు మేకల ఆదినారాయణ, మాల మహానాడు నాయుకులు కాకుమాను రవి, గోగులముడి రంజిత్, తానికొండ ఆనంద్, మరియు బాధితులు పాల్గొన్నారు.

