ఖరీఫ్ లో సాగు చేసిన పంటలకు ప్రతి రైతు ఈ- క్రాప్ అనంతరం, ఈ- కెవైసీ పూర్తి చేయించాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. బొద్దికూరపాడులో సోమవారం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఈ- కెవైసీ పట్ల అవగాహన కల్పించాడు. తాళ్లూరు మండంలో 51 పంటలకు గాను 9153 ఎకరాలు ఈ- క్రాప్ చేయగా, అందులో 3356 మంది రైతులు ఉన్నారని అన్నారు. అందులో 2465 మంది రైతులు ఈ- కెవైసీ పూర్తి చేసారని, మిగిలిన వారు కూడ ఒటిపీ ద్వారా పూర్తి చెయ్యాలని కోరారు. సర్వర్ ఆగు లోపు ప్రక్రియను పూర్తి చేయ్యాలని లేకుంటే రైతులు నష్టపోతారని అన్నారు. ఉదయం, సాయంత్రం రైతులు అందుబాటులో ఉండే సమయంలో విఏఏలు రైతులను అప్రమత్తం చేసి పూర్తి చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాల కోటయ్య, ఎఈఓ నాగరాజు, విఏఏ అజ్మీర్ రైతులు పాల్గొన్నారు.
