ఆర్థిక క్రమ శిక్షణతో కుటుంబాలు వృద్ధిలోనికి వస్తాయని దర్శి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మెనేజర్ కందిమళ్ల స్వాములు పేర్కోన్నారు. తూర్పు వీరాయపాలెంలో సోమవారం దర్శి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో కళాజాత బృందం పాల్గొని ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెనేజర్ స్వాములు మాట్లాడుతూ… ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో మిగిలిన అన్ని బ్యాంకుల కంటే డిపాడిట్స్ పై అధిక మొత్తంలో వడ్డీ ఇస్తుందని అన్నారు. అదే విధంగా ఇన్సష్యూరెన్స్ సౌకర్యం కూడ ఉందని చెప్పారు. అన్ని రకాలుగా రైతులు, పొదుపు సంఘాలు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాలకు రుణాలు అందిస్తూ …ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. రుణాలు సకాలంలో చెల్లించినట్లయితే బ్యాంకులో పరపతి కూడ పెరుగుతుందని వివరించారు. బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
