ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటు సారా తయారు చేసి విక్రయానికి పాల్పడుతూ సెబ్ పోలీసులు అకస్మిక దాడిలో పట్టు బడ్డ నిందితునికి దర్శి జె ఎఫ్ సీఎం కోర్టు 30 నెలలు జైలు శిక్ష, రూ. 4లక్షలు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించినట్లు దర్శి సెబ్ ఇన్స్పెక్టర్ బి.సుందర రామయ్య తెలిపారు. తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం గ్రామ సమీపంలో 2021 మార్చి 13న సెబ్ పోలీసులు అకస్మిక దాడి చేయగా, నిందితులు నాగులూరి ఏసు (బొద్దికూరపాడు), మేడమ్ అరుణకుమార్ (కంభం) నుండి 360 లీటర్ల సారా. 2700 లీటర్ల బెల్లం ఊటతో పట్టుబడ్డారు. నిందితులలో ఏసు మృతి చెందగా, అరుణకుమార్ మీద పెట్టిన నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేసినట్లు దర్శి సెబ్ ఇన్స్ఫెక్టర్ బి. సుందర రామయ్య వివరించారు.
నాటు సారా కేసులో నిందితుడుకి 30 నెలలు జైలు శిక్ష – రూ. 4లక్షలు జరిమాన – వివరాలు వెల్లడించిన దర్శి సెబ్ ఇన్స్ఫెక్టర్ బి.సుందర రామయ్య
09
Oct