పోస్టల్ సేవలను విస్తృతంగా ప్రజలలోనికి తీసుకువెళ్లాలి జనంలోని మనం కార్యక్రమాన్ని ప్రారంభించిన పోస్టల్ శాఖ విజయవాడ అసిస్టెంట్ డైరెక్టర్ శివ నాగరాజు

పోస్టల్ సేవలను విస్తృతంగా ప్రజలలోనికి తీసుకువెళ్లాలని పోస్టర్ లైఫ్ ఇన్స్ రెన్స్ ఫైనాన్సియల్ సర్వీస్ (పీఎల్ఎఅండ్ ఎఫ్ఎస్) అసిస్టెంట్ డైరెక్టర్ శివ నాగరాజు అన్నారు. ఒంగోలు ప్రధాన తపాలా కార్యాలయంలో మంగళవారం జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ‘విత్య సశక్తి కరణ్ దివాస్ జనంలోనికి మనం కార్యక్రమాన్ని ‘ నిర్వహించారు. రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ శివ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రజలను నూతన పోస్టల్ పథకాలతో ఆకర్షించి మెరుగైన సేవలు అందించటానికి పోస్టల్ శాఖ నూతన కార్యక్రమాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అన్ని వర్గాల వారిని ఆకర్షించే విధంగా పదుపు పథకాలను ఉన్నాయని, వాటి కాలవ్యవధి. టాక్స్ బెనిఫిట్స్ ప్రజలు తెలుసుకుని ఉపయోగించుకోవాలని కోరారు. ఇప్పటికే బ్యాంకు తరహాలో మెరుగ్గా వారి ‘ నివాసాల వద్దకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఆధార్ అనుసంధానంగా వారికి సగదు అందిస్తున్నామని తెలిపారు. సుకన్య సంవృద్ధి యోజన పథకంను అధిక మొత్తంలో నమోదు చేయించిన పోస్టర్ అధికారులను అభినందించారు.
విజయవాడ సీపిఎంజి మెనేజర్ అచ్యుత్ కుమార్ మాట్లాడుతూ …పోస్టల్లో ప్రతి పైసా సురక్షితమని గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలకు అనువైన డిపాడిట్స్ ఉన్నాయని ఉపయోగించుకోవాలని కోరారు. పోస్టల్ సేవలను డిజిటల్ రూపంలో కూడ లభ్యమవుతాయని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు. ప్రకాశం తపాలా డివిజన్ సీనియర్ సూపరిండెంట్ ( పర్యవేక్షకులు) హరి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ డిపార్ట్మెంట్ అనేక పథకాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ప్రజలకు వివరించాలని చెప్పారు. పోస్టల్ సేవింగ్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్, మంత్లీ ఇన్ కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్స్ సెవిగ్ స్కిము, పబ్లిక్ ప్రొవైడ్ ఫండ్, సుకన్య సంవృద్ధి అకౌంట్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస్ పత్ర, మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్, ఇన్సష్యూరెన్స్ పథకాలను గురించి వివరించారు. డిప్యూటీ సూపరిండెంట్ బివిఎన్ సురేష్. సిపిఎంజీ ప్రాజెక్ట్ మెనేజర్ అచ్యుత కుమార్, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మెనేజర్ వంశీ క్రిష్ణ. పోస్టు మాస్టర్ రాజేశ్వరీలు పలు పథకాల గురించి వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఇన్స్ రెన్స్ కవర్ చేసిన పోస్టల్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *