వైఎస్సాఆర్ క్రాంతి పధం కింద ఎస్సీ, ఎస్టీ పొదుపు మహిళలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రుణాలు మంజూరు చేసి చేయూత నివ్వటం జరుగుతుందని వైఎస్సాఆర్ క్రాంతి పథకం ఫైనాన్స్ డీపీఎం నరసింహారావు తెలిపారు. వైఎస్సాఆర్ క్రాంతి పధం కార్యాలయంలో మంగళవారం వివోఏలకు జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకుబ్యాం కులందు రుణాలు పొందని ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రాధాన్యతనిచ్చి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ పొదుపు మహిళలు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. వెనుక బడిన ఎస్సీ, ఎస్టీ మహిళలను ఆర్ధికంగా అభివృద్ధి పొందేందుకు రుణాలు మంజూరు చేయటం జరుగుతుం దన్నారు. తీసుకున్న రుణాలతో తమకు తోచిన వ్యాపారాలు చే పట్టి వృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం దేవరాజ్, హెడి డీపీఎం ఆదిశేషు, ఏసీ వసుంధరాదేవి, స్త్రీ నిధి మేనేజర్ కల్యాణ్, వీవోఏలు పాల్గొన్నారు.
మహిళలకు సబ్ ప్లాన్ రుణాల మంజూరు -వైఎస్సాఆర్ క్రాంతి పథకం ఫైనాన్స్ డీపీఎం నరసింహారావు
11
Oct