ఓటరు జాబితాలో ఉద్దేశపూర్వకంగా అయిదు కంటే ఎక్కువ ఓట్లు కొత్తగా చేర్పించడం, తొలగింపులకు పాల్పడితే… ఆ దరఖా సులను పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని దర్శి నియోజకవర్గ ఎలక్ట్రో రల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎంవీఎస్. లోకేశ్వరరావు తెలిపారు. అవి సరైనవి. కాదని తెలిస్తే అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. దర్శి తహసీల్దార్ కార్యాలయంలో పలు రాజకీయ పార్టీల ప్రతి నిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈఆర్వో మాట్లాడుతూ.. పోస్టల్ శాఖ ద్వారా పలుసార్లు నమోదైన, శాశ్వత వలస ఓట ర్లను ఫార్మాట్ ఎ, బి నోటీసుల ద్వారా సదరు ఓటర్ల నివాస స్థలం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వారికి ఇప్పటికే నోటీసులు పంపామన్నారు. తొలగించిన ఓటరు వివరాలను పలు మార్లు పరిశీలించడంతో పాటు ఇంటింటికీ వెళ్లి వివరాలు రాబట్టామని తెలిపారు. తొలగించిన ప్రతి ఓటుకు సంబంధించి పార్టీ ప్రతినిధుల అభ్యంత రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఒకే డోరు నంబర్ లో అధిక మొత్తంలో నమోదైన ఓటర్ల వివరాలను ఇంటింటికీ వెళ్లి పరిశీలించామన్నారు. ముసా యిదా జాబితా ప్రచురణకు ముందు లేదా తరువాత అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహాలు, సూచనలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్వో జ్వాలా నరసింహం, డీటీ రవిశంకర్, సీని యర్ సహాయకుడు రామారావు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

