భారతీయ జనతాపార్టీ జిల్లా అధికార ప్రతినిథులుగా బొద్దిలూరి ఆంజనేయులు, ఎనుముల నాగేశ్వరావులను నియమిస్తూ బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివారెడ్డి నియామక పత్రం అందించారు. విష్ణు ప్రియ మాల్లో బుధవారం నూతనంగా బాధ్యతలు అప్పగించిన కమిటీతో సమావేశం ఏర్పాటు చేసారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ ప్రత్యర్థి పార్టీలకు దీటుగా సమాధానం చెప్పడానికి, ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయుటకు పార్టి లోని పలు మోర్చాలకు, కమిటీల బాధ్యులను ప్రక్షాళణ చేస్తూ….. పలువురికి బాధ్యతలను పెంచుతూ….. మరికొందరు ఉత్సాహవంతులకు బాధ్యతలను ఇస్తూ …… మార్పులు చేయాలని ఇచ్చిన సూచన మేరకు పార్టీ సీనియర్ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, ఎనుముల నాగేశ్వరరావు లను జిల్లా అధికార ప్రతినిధులుగా నియమించినట్లు తెలిపారు . రాబోవు ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలకు ధీటుగా క్షేత్ర స్థాయిలో పనిచెయ్యాలని సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధికార ప్రతినిథులు బొద్దిలూరి ఆంజనేయులు, నాగేశ్వరరావులు సహకరించిన అధ్యక్షులకు, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడ దామోదర్, ఎస్సీ మోర్చా కన్వీనర్ పెరిక లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కుంచాల వెంకట శివ, జిల్లా మీడియా ఇంఛార్జ్ ధనిశెట్టి రాము నాయుడు తదితరులు బొద్దులూరికి శుభాకాంక్షలు తెలిపారు.

