శ్రీ హర్షిణి జూనియర్ కళాశాల విద్యార్థులు అండర్ -19 హాకీ సెలక్షన్స్ లో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయిలో జరుగు పోటీలకు ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. కందుకూరులో టి ఆర్ ఆర్ గవర్నమెంటు జూనియర్ కళాశాలలో జరుగుతున్న పోటీలలో పాల్గొని విద్యార్థులు డి. అంజనా దేవి, వి. వెష్ణవి, షేక్ కమరున్, టి. శ్రీలక్ష్మి, పి. పూజితలు ప్రతిభ కనపరచారు. విశాఖ పట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలలో పాల్గొననున్నారు. ఎంపిక అయిన విద్యార్థులను బుధవారం కళాశాలలో విద్యా సంస్థ చైర్మన్ గోరంట్ల రవికుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ కరణం నారాయణ, దాది ఆంజనేయులు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.
