భారతీయ జనతా పార్టీ అభ్యున్నతికి యువత కృషి చెయ్యాలి

భారతీయ జనతా పార్టీ అభ్యున్నతికి యువత కృషి చెయ్యాలని ఆ పార్టీ జిల్లా యువమోర్చ అధ్యక్షుడు పువ్వాడి దామోదర్ అన్నారు. యువమోర్చ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటి సారిగా దర్శి విచ్చేసారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో గురువారం పార్టీ నాయకులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా యువమోర్చా అధ్యక్షుడు పువ్వాడి దామోదర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువత చెయ్యాల్సిన కృషిని వివరించారు. నిరుద్యోగ యువతకు అండగా నిలవాల్సిన ఆవశ్యకతను వివరించారు. రాష్ట్ర కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు, దర్శి అసెంబ్లీ కన్వినర్ మాడపాకుల శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, సాయి, వసంత్ నాయక్, పట్టణ అధ్యక్షుడు గురువార్జన్ రావు, యువనాయకుడు వంకదారి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏవీ నారాయణ రెడ్డి, కాకర్ల నాగసాయి. ఎద్దుల అరుణ కుమార్, అచ్యుత శరత్ కుమార్, మల్లి బార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *