ప్రకాశం జిల్లా నుండి విజయవాడ తరలి వెళ్ళిన బిజెపి శ్రేణులు. ఆజాదీకా అమృత మహోత్సవాల “నా మట్టి నా దేశం” కార్యక్రమంలో భాగంగా దిల్లీలో నిర్మించే అమరవీరుల అమృతవాటిక స్థూపం కొరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సేకరించిన పుట్టమన్ను, బియ్యాన్ని ఢిల్లీకి పంపే కార్యక్రమంలో భాగంగా విజయవాడ తరలి వెళ్లారు.
విజయవాడలోని రాష్ట్ర కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ కు బయలుదేరిన ర్యాలీకి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జండా ఊపి ప్రారంభించారు. అనంతరం వివిధ జిల్లాల నుండి వచ్చిన అమృత కలశాలను అమృత కలశ యాత్ర ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీకి పంపారు.
ఈ సందర్భంగా ప్రధాని పిలుపుమేరకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త తమ ఊరిలోని తమ మండలంలోని ఆలయంలో వద్ద ప్రార్థన స్థలాల వద్ద పుట్టమన్ను బియ్యం సేకరించి పంపారని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.
ఒంగోలు నుండి 50 మంది కార్యకర్తలు విజయవాడ నుండి ఢిల్లీ బయలుదేరారని బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు.
అద్దంకి నుండి::
నా మట్టి నా దేశం కార్యక్రమంలో భాగంగా అద్దంకి రూరల్ మండలంలోని పలు గ్రామాల నుండి సేకరించిన పవిత్రమైన మట్టిని అమరవీరుల స్మృతి వనం అమృత వాటిక కోసం ఢిల్లీ తీసుకువెళ్లే అమృత కలశ యాత్రలో భాగంగా అద్దంకి రూరల్ మండల ప్రతినిధిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లిన బిజెపి సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాసరావు మరియు బాపట్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సీనియర్ నాయకులు మోర్ల కృష్ణ ప్రసాద్.



