మర్రిపూడి మండల కేంద్రమైన మర్రిపూడి బస్టాండ్ సెంటర్ నుంచి పృథులగిరి లక్ష్మీ నృసింహ స్వామి కొండ, ఎస్టీ రాజుపాలెం గ్రామం వరకు 10.5 కి.మీ మేర తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.8.5 కోట్ల నిధులు మంజూరు చేసి నందుకు కృతజ్ఞతగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మండల వైఎస్సార్ సీపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. మంగళవారం మర్రిపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వాకా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిధులు మంజూరు కావడంలో ఎంపీపీ కృ షిని. వైఎస్సార్ సీపీ నాయకులు కొనియాడారు. మండల మాజీ అధ్యక్షులు బోద రమణారెడ్డి, ఇనుకొల్లు పిచ్చిరెడ్డి, మర్రిపూడి సొసైటీ అధ్యక్షుడు బోగసముద్రం విజయ భాస్కర్ రెడ్డి, మాచేపల్లి నాగయ్య ముదిరాజ్, అలికేపల్లి కోటేశ్వరరావు, ఇనుకొల్లు మాదిరెడ్డి, వై.శ్రీను, ఈదుమూడి రవి ప్రసాద్ పాల్గొన్నారు.
