ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ఆధ్యులు పొట్టి శ్రీరాములు – భాజపా మండల నాయకులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ఆధ్యులు పొట్టి శ్రీరాములు.

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని స్థానిక బిజెపి మండల నాయకులు గుర్రం రంగనాథ్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డు కూడలి వద్ద పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా మీడియా ఇన్చార్జి ధనిశెట్టి రామునాయుడు విచ్చేశారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక భాషా ప్రయోక్త రాష్ట్రాల కోసం గాంధీ మార్గంలో 58 రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినదని, వారి త్యాగం భావితరాలు స్మరించుకునే విధంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు అమర రహే అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఐటి వింగ్ ఇంచార్జ్ గుర్రం సత్యనారాయణ, మండల కార్యదర్శి మిరియం శ్రీనివాసరావు, మరియు సభ్యులు ప్రసన్న కుమార్, కూరపాటి సుమంత్, అమరాసత్యం, చీదెళ్ల పవన్ కుమార్, సామి సత్యనారాయణ మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *