ప్రకాశం జిల్లాలో ప్రాధమిక, ప్రాధమికోన్నత , ఉన్నత పాఠశాలల్లో పిల్లల ఆధార్ లు అప్డేట్ చేయలేదని జిల్లా విద్యాశాఖాదికారి 1348 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని APTF తాళ్లూరు మండల శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. పిల్లలకు ఆధార్ కార్డులు తీయించుకోవలసిన బాధ్యత తల్లితండ్రులది , తీయించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. పిల్లలకు ఆధార్ కార్డులు లేక పోవడానికి సవా లక్ష కారణాలు మచ్చుకు కొన్ని పుట్టినతేదీ సర్టిఫికెట్స్ లేకపోవడం, ఫోన్ నంబర్స్ పోవడం, OTP లు రాకపోవడం, తీయించుకున్నవారికి ఫాల్స్, ఫెయిల్ అనిరావడం, అవిద్య, పేదరికం, వలసలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. అప్పుడేమో ఆధార్ కార్డు లేకపోయినా అన్నీ సున్నాలు కొట్టి అడ్మిషన్ చేర్చుకోమన్నారు. ఇప్పుడేమో ప్రజల్లో ఉపాధ్యాయులను చులకనచేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం ప్రధానోపాధ్యాయుల ఆత్మ విశ్వాసంను దెబ్బతీయడమే. ఆధార్ కార్డులు లేని పిల్లలకు స్పెషల్ డ్రైవ్ ద్వారా సర్టిఫికెట్స్ జారిచేసి కార్డులు తీయించుటకు తగు చర్యలు గైకొనవలసిందిగా కోరుతూ , ప్రధానోపాధ్యాయుల పై జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవలసిందిగాAPTF తాళ్లూరు మండల శాఖ తరపున కోరుచున్నాము.
