బొద్దికూరపాడులో చేతి కర్రలు అందజేత

జాతీయ ప్లోరోసిస్ నివారణ (ఎన్పీపీసీఎఫ్) లో బాగంగా గురువారం బొద్దికూరపాడులో జిల్లా ప్లోరోసిస్ నియంత్రణ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చేతి కర్రలను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామాలలో ప్లోరోసిస్ నియంత్రణ కార్యక్రమంలో అవసరమైన పరికరాలు అందిస్తున్నట్లు చెప్పారు. తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ బి. రత్నం మాట్లాడుతూ గ్రామాలలలో కాళ్లు వంకర, నడవలేని వారికి అవసరమైన వాకర్స్, కర్రలు, వీల్ చైర్స్ , లంబా బెల్ట్స్ ఎన్పీపీసీఎఫ్ ఆధ్వర్యంలో అందిస్తారని అవసరమైన వారు స్థానిక ఆరోగ్య కార్యకర్తను లేదా పీహెచ్సీని సందర్శించాలని కోరారు. ఎంపీహెచ్ చంద్రశేఖర్, ఎఎన్ఎం సలోమి తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *