తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో దర్శి రోడ్డులో ఉన్న శ్రీహరి హర సుత అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఈనెల 2వ తేది నుంచి అన్ని మాలధార స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుందని ఆలయ అర్చకులు డాక్టర్ గురుస్వామి ఆలయ కమిటీ వారు తెలిపారు. తాళ్లూరు మండలంలో అన్ని గ్రామాల్లో మాల ధార స్వీకరించిన స్వాములు అయ్యప్ప స్వాములు భవాని స్వాములు ఆంజనేయ స్వాములు ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి గుడిలో అన్నదానం స్వీకరించవలసిందిగా కోరుతున్నామని ఆయన తెలిపారు.
