ప్రకాశం జిల్లాలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తాళ్లూరు మండలం తూర్పు గంగవరం
పంచాయతీ పరిధిలోని గుంటి గంగా భవాని దేవాలయంహుండీ ఆదాయాన్ని లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం దేవాలయ ఆవరణలోనిర్వహించారు. దేవాదాయ శాఖ కందుకూరుఇన్స్పెక్టర్ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఈవో ఏబీ భాస్కర్ రెడ్డి, గుంటి గంగ దేవాలయ ట్రస్ట్ కమిటీ చైర్మన్ కొసనాగురుబ్రహ్మం, ఇతర కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలోని నగదును లెక్కించారు. 2023సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ నుండి 2023 వసంవత్సరం నవంబర్ 3వ తేదీ వరకు హుండీలో భక్తులువేసిన నగదును లెక్కించారు. 7,02,439 రూపాయల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు.ఈకార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పోగుల ప్రభాకర్, దేవాదాయ శాఖ రికార్డ్అసిస్టెంట్ కోట శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, దేవాదాయ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


