తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో, అతి తక్కువ నీటి వనరులతో చిరుధాన్యాల సాగు చేసినట్లయితే రైతులకు అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయాధికారి బి ప్రసాదరావు అన్నారు. మండలంలోని వెలుగు వారి పాలెం గ్రామంలో శుక్రవారం క్షేత్ర పర్యటన సందర్భంగా చిరుధాన్యాల పంటలను, ఊదల పంట దిగుబడిని పరిశీలించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వలన జూన్ ,ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయినందున తక్కువ నీటి వనరులతో సాగు చేసే చిరుధాన్యాలు, ఊదలు తదితర పంటలకు సంబంధించిన మినీ కిట్ల ద్వారా పంటలను సాగు చేసే విధానాన్ని రైతులకు సూచించామని దాని ప్రకారం సాగు చేసిన రైతులకు చిరుధాన్యాలలో మంచి దిగుబడి లభించిందని ఆయన తెలిపారు. చిరుధాన్యాలలో ప్రధానంగా ఉన్న ఊదలను అంతర పంటగా రైతులు వేశారని డి. హెచ్. బి.యం. 93 – 3 రకం పంట ఊదలను రైతులు అంతర్ పంటగా వేశారని, 3 నెలలలో మంచి దిగుబడి లభించిందని ఆయన తెలిపారు. ఊదలు క్వింటా ఒక్కింటికి 4500రూపాయల మార్కెట్ ధర ఉన్నట్లు ఆయన తెలిపారు.

