తూర్పుగంగవరంలో అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు స్వామి డాక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉభయ దాతలు కాలువ బలరామి రెడ్డి, కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలకు స్వాములు సుఖీభవ అంటూ దీవేనలు అందించారు.


