తూర్పు గంగవరం – దారంవారిపాలెం వారి పాలెం రోడ్డుపై మురుగు తొలగించే నాథుడే లేరా !? – మురుగు నీటితో తీవ్ర ఇబ్బందులతో రాక పోకలు సాగిస్తున్న ప్రయాణికులు – మోకాళ్ళ లోతు మురుగు నీటితో ఇబ్బందులు పడుతున్న మహిళలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన … క్షేత్ర స్థాయి అధికారుల పనితీరుకు కొలమానం ఈ రోడ్డు దుస్థితికి నిదర్శనం. తూర్పుగంగవరం, దారం వారి పాలెం రోడ్ లో హరిదాస్ నగర్ కాలనీకి చెందిన మురుగు నీరు వెళ్లటానికి ఇబ్బందికరంగా ఉండటంతో నాటి గ్రామ స్థాయి అధికారులు నిర్ణయం మేరకు ఒక కల్వర్టర్ ను లక్షల వ్యయంతో నిర్మించారు. అయితే ఆ కల్వర్టర్ ద్వారా నీరు వెళ్లేందుకు తూర్పు గంగవరం తాళ్లూరు రోడ్లో సైడు కాలువలు లేక పోవటంతో ఆ రోడ్డు వెంబడి దేవాలయం కూడ ఉండటంతో అక్కడ ప్రజలు అభ్యంతరం పెట్టారు. దీంతో హరిదాస్ నగర్ మురుగు నీరు అంతయూ…. దారం వారి పాలెం రోడ్డు వెంబడి ప్రవహిస్తూ తారు రోడ్డు క్రమేణ మురుకి… రోడ్డుగా ….మారి గుంతల మయం అయినది. …కొంత మేర ఇబ్బందులు ఉన్నా సరే వెళ్లటానికి వీలు ఉంటే పర్వాలేదు….. కాని ఈ రోడ్డు అంతయూ మోకాలు రోతు గుంతలు …..మరియు మురికి నీరు …ఉండటంతో ఆ రోడ్డు ద్వారా రైతులు ద్విచక్ర వాహనాలపై ఎరువులు తీసుకువెళ్లాలన్నా….లేదా కుటుంబంతో కలసి ప్రయాణించాలన్నా సరే సాహసం చేర్యాల్సిందే. మాటలు కోటలు దాడుతాయి… అడుగు గడప దాటటం లేదు…..నిత్యం అధికారులు స్వచ్ఛత గురించి వల్లెవేస్తూ ….శుభ్రతగా ఉండాలి లేదంటే జబ్బులు దరిచేయంతాయంటూ వల్లెవేయటం తప్ప…ఎం క్షేత్ర స్థాయిలో అందుకు తగిన చర్యలు తీసుకోవటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. .. కళ్ళకు కనిపిస్తున్న ఇటువంటి మురుగు ఉన్న ప్రాంతంలో వ్యాధులు సైతం ప్రబలే అవకాశం ఉన్నదని ఆ ప్రాంత కుటుంబీకులు సైతం ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం మాటలు కోటలు దాటుతున్నాయి కాని…. అడుగు గడప దాటి క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలించక పోక పోవటంతో ఇటువంటి పరిస్థితులు వచ్చాయని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిత్యం ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు, ప్రయాణికులు అధికారులకు, పాలకులకు శాపాలు పెడుతూ… తమ కష్టమైన ప్రయాణం ఈ రోడ్డు ద్వారా సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ రోడ్డు దుస్థితిపై మొర పెట్టుకుంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిథులు స్పందించి ఈ రోడ్డుపై కనీసం మురుగు నీరు నిల్వకుండా అయినా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *