విజయవంతంగా స్టేట్ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష నిర్వహణ – పాఠశాలలను పరిశీలించిన తగిన సూచనలు చేసిన విద్యాశాఖాధికారులు

ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష (ఎస్ఈఎస్) శుక్రవారం మండలంలో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించే నిమిత్తం నిర్వహించిన సర్వే పరీక్షలో 3, 6, 9 తరగతులు విద్యార్థులకు నిర్వహించారు. తాళ్లూరు మండలంలో 22 ప్రాధమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన 995 మంది విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొన్నారు. మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ లు ఆయా కేంద్రాలను సందర్శించి ఫీల్డ్ ఇన్విజిలేటర్ ల కు తగిన సూచనలు చేసారు. సీఆర్పీలు శ్రీనివాస్, శాంతి, ఎంఐసీ వెంకాయమ్మ, డెటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) శ్రీనివాస్, అకౌంటెట్ కిరణ్, సిబ్బంది మహేష్ లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *