కోడంగల్ రోడ్ షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు రెట్టింపు ఉత్సాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో కార్యకర్తలకు, నాయకులకు మంత్రి కెటీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ముందుగా హెలిక్యాప్టర్లో కొడంగల్ చేరుకుని రోడ్ షోలో మంత్రి కెటీఆర్ పాల్గొన్నారు.
