దరిశి లో స్థంభించిన రహాదారులుఅంగన్ వాడీల రాస్తారోకోరోడ్డుపై బైటాయించిన ఆందోళన కారులు

11వ రోజూ అంగన్ వాడీ ల సమ్మె , ఉదృతంగా కొనసాగింది. ICDS దరిశి ప్రజెక్టు వద్ద ప్రత్యేక శిభిరం వద్ద వైసిపి ప్రభుత్వ మెండి వైఖరి నశించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని , సి.యం డౌన్,డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలతో మద్యాహ్నం ఒంటి గంటకు పెద్ద ఎత్తున గడియారపు స్థంబం వద్దకు వచ్చి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ స్థంభించి పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ రాస్తారోకో కి అంగన్ వాడీ యూనియన్ నాయకురాలు బాదిరెడ్డి అచ్చమాంబ , చైతన్య భారతి మాట్లాడుతూ వాలంటీర్లకు వేతనాలు పెంచిన ప్రభుత్వం మాకు ఎందుకు పెంచదని , తాళాలు పగల కొట్టిన సచివాలయం వారిపై కేసులు పెట్టినా ఎందుకు అరెస్టు చేయలేదని , ప్రభుత్వ అదికారులు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షలు వెల్లంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ మీ పోరాటం న్యాయం అయిందని సమ్మె పట్టుదలతో 11 రోజుల నుంచి బెదింపులు , వత్తిడిలకు లొంగకుండా తెగువతో పోరాడుతున్న మీకు వ్యవసాయ కార్మికులు అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. ఈ రాస్తారోకో కి ప్రజా సంఘాల నాయకులు ఉప్పు నారాయణ , గర్నిపూడి సామ్యేల్ , రంగనాయకులు, బోడపాటి హనుమంతరావు , లక్ష్మీదేవి , సుబ్బమ్మ , నాగమణి , శాంతమ్మ , విశ్వవాణి , అంజమ్మ , పద్మావతి ,అనిత , విశ్రాంతమ్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *