శాసన సభ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బిజెపి జాతీయ నాయకులు వై సత్య కుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధిస్తారని ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు పేర్కొన్నారు. సత్య కుమార్ నామినేషన్ వేసిన సమయం నుండి రాష్ట్ర బిజెపి మహిళా మోర్చా నాయకత్వం ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు నేతృత్వంలో ఆరుగురు ప్రకాశం జిల్లా బిజెపి నాయకుల సమూహము ధర్మవరంలో సత్య కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ పదిరోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మంగళవారం ఉదయం ధర్మవరం నుంచి ఒంగోలు నగరానికి తిరిగి వచ్చిన బిజెపి బృంద నాయకురాలు విజయ రావు మాట్లాడుతూ… స్థానిక సమస్యలనే ప్రచారస్త్రాలుగా మార్చుకొని ప్రతి వీధికి, ప్రతి ఓటర్ ని కలిసి ధర్మవరం దశ దిశ మారాలంటే సత్య కుమార్ కి ఓటేయాలని, అసెంబ్లీలో అడుగు పెట్టాలని తద్వారా ధర్మవరం రూపురేఖలే మారిపోతాయని, ప్రజల జీవన స్థితిగతులు ఉన్నతంగా మారతాయని తెలపడం జరిగిందని వివరించారు. కేంద్రంలోని ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలను వివరించడం జరిగిందని తెలిపారు. ధర్మవరం ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూల దృక్పథం తో ఉన్నారని, తమ మద్దతు కూటమి అభ్యర్థి కేనని తెలిపారన్నారు. సత్య కుమార్ సతీమణి త్రివేణి వెంట ధర్మవరం లో ప్రతి ఓటర్ ని కలసి, ప్రతి గడపకు తిరిగి ప్రచారం నిర్వహించామని విజయరావు తెలిపారు. ఒంగోలు నుండి ధర్మవరం వచ్చి ప్రచారం చేసిన తమను “ప్రకాశం రా టీం” గా త్రివేణి వ్యవహరించారని తెలిపారు.
“ప్రకాశం రా టీం” సభ్యులు ప్రకాశం జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు, మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ & జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి, జిల్లా కార్యవర్గ నాయకురాలు చిట్టా తిరుమల, మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు దేవరపల్లి శ్రీలక్ష్మి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక లక్ష్మణ్ మరియు ప్రకాశం జిల్లా మీడియా కన్వినర్ ధనిశెట్టి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.



