తాళ్లూరు మండలంలో ఘనం గా మేడే వేడుకలు.

కార్మిక వర్గ దినోత్సవమైన “మేడే”ని స్ఫూర్తిగా తీసుకొని కార్మిక హక్కుల కోసం పోరాడాలని తూర్పు గంగవరం మోటార్ ఫీల్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా తూర్పు గంగవరం మోటర్ ఫీల్డ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. కార్మికుల హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడిచేసి ఉన్న హక్కులను కూడా హరిస్తున్నాయని,పెరిగే ధరలతో నిజవేతనాలు పడిపోతున్నాయని,విద్య,వైద్యం ఖరీదవటంతో సామాన్యులకు అందుబాటులో లేవని, ఆయన అన్నారు .పోరాడి సాధించుకోకపోతే జీవితాలు మరింత దుర్భరం మవుతాయి అన్నారు.. తూర్పు గ్రామంలో దర్శిపోవు రోడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా జెండా ఎగరవేసి కార్మికుల ఐక్యత చాటారు ఈ.. కార్యక్రమంలో యూనియన్ గౌర అధ్యక్షులు పల్లెవాడ సుబ్రహ్మణ్య చారి, తూము లక్ష్మి నారాయణ , ఉపాధ్యక్షులు గిరిబాబు కార్యదర్శి వెంకటేశ్వర్లు , ప్రధాన కార్యదర్శి నరసింహారావు , ట్రెజరరీ కనిగంటి వెంకటేశ్వర్లు , సీనియర్ మెకానిక్ దొమ్మేటి శ్రీనివాసరావు , లంకోజు భాస్కరరావు మోహన్, పాంటింగ్. పోల రావు కొండలు, సలాం, ఇడ్లీ , అమాన్ ,వెంకీ , కాలేష్ , దొంతు శ్రీను , బాలరాజు , శైదా , రవి, మస్తాన్ , సీనియర్ మెకానిక్ మస్తాన్ , సేక్ బేరీ , కాలేషా వలి , విఘ్నేష్, యునియన్ సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *